పేద మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసిన లారెన్స్

0
1

నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేద మహిళల కోసం ‘పట్టు చీరలు’ పథకాన్ని ప్రారంభించారు. పండుగలకు కట్టుకోవడానికి తనకు పట్టుచీర కావాలని, పేదరికం వల్ల కొనలేకపోతున్నానని ఓ వృద్ధురాలు రాసిన లేఖతో ఆయన చలించిపోయారు. దీంతో తన బర్త్ డే సందర్భంగా ఈ స్కీము శ్రీకారం చుట్టారు. తొలి విడతగా 5వేల మంది గ్రామీణ నిరుపేద మహిళలకు పట్టుచీరలు అందించనున్నారు. నిన్న చెన్నైలో తల్లి కణ్మణితో కలిసి చీరలు పంపిణీ చేశారు.