జనకాపూర్‌లో భూలాయి కోలాహలం. కమిషనర్‌ను ఘనంగా సన్మానించిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్

0
58

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మునిసిపాలిటీలోని జనకాపూర్ లోని 1వ వార్డులో భూలాయి వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. సంస్కృతి ఉట్టిపడేలా సాగిన ఈ సంబరాల్లో ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారితో పాటు వార్డు ప్రజలు కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.

ఈ విధమైన సాంప్రదాయ వేడుకల నిర్వహణ ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు, పురపాలక అధికారులు మరియు ప్రజల నడుమ పరస్పర సంబంధాలు, సమన్వయం మరింత బలోపేతం అవుతాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.