కొవ్వూరులో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు పాల్గొన్నారు..ఎన్డిఎ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి సైకిల్ గుర్తుకు ఓటేసి సంక్షేమానికి పట్టం కట్టాలని కోరారు. టిడిపి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు, ఎంపిపి అభ్యర్థి పంచాడ రజని, మండల అధ్యక్షుడు పంచాడ చంద్ర, నాయకులు చంద్రమౌళి, రామకృష్ణ, ఈశ్వరరావు, బంటు రాజు, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.










