🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ఆటస్థలానికి అడ్డంకిగా ఉన్న కరెంట్ స్తంభాలను వెంటనే తొలగించి, పక్క నుండి వేయాలని ప్రగతిశీల ప్రజల విద్యార్థి సంఘం (పిడిఎస్యు) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె హరిత ఐఏఎస్ గారికి, పిడిఎస్యు ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలపై గ్రీవెన్స్ సందర్భంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. కళాశాల మైదానంలో ఆటస్థలానికి అడ్డంగా కరెంట్ స్తంభాలు ఉండటం వల్ల విద్యార్థులు ఆడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, తక్షణమే స్పందించి ఆ స్తంభాలను పక్కకు మార్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, ఆసిఫాబాద్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.కె సమీర్, జగజంపుల తరుణ్, మండల ఉపాధ్యక్షుడు శివశంకర్, మండల నాయకులు శివప్రసాద్, అరవింద్, ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.










