విద్యుత్, నీటి వృధాను అరికట్టండి|

0
10

విద్యుత్‌, నీటి వృథాను అరికట్టాలని సీపీ సుమతి ఆదేశం

అల్వాల్, నవంబర్ 2:ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాల్లో విద్యుత్‌, నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ప్రత్యేక మెమో జారీ చేశారు.ఉదయం వేళల్లో అవసరం లేకుండా విద్యుత్‌ దీపాలను వెలిగించవద్దని, ఏసీలు, ఇతర విద్యుత్‌ పరికరాల వినియోగాన్ని పరిమితం చేయాలని స్పష్టం చేశారు. కార్యాలయాల్లో సిబ్బంది లేని సమయంలో లైట్లు, పరికరాలను ఆపివేయాలని, నీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వినియోగించాలని పేర్కొన్నారు.

ఈ చర్యలు అన్ని పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాల్లో అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని సీపీ ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది స్వయంగా పొదుపు పద్ధతులను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, వనరుల పరిరక్షణపై వారిలోనూ అవగాహన కల్పించాలని సూచించారు.

#Sidhumaroju

Alwal