అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చర్చలు.|

0
8

● జెడ్సీ సంచిత్‌తో మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశం

● చెరువు సుందరీకరణ, ఫైర్ స్టేషన్ ఏర్పాటుపై చర్చ

● రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ పనుల పురోగతిపై ప్రస్తావన

అల్వాల్, నవంబర్ 3: నియోజకవర్గంలోని పలు అభివృద్ధి, మౌలిక వసతుల సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జెడ్సీ సంచిత్‌తో చర్చించారు. మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కిషోర్, జగదీష్ గౌడ్, పరశురాం రెడ్డి, అమీన్, చిన్న యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చినరాయుని చెరువు సుందరీకరణ, ఫైర్ స్టేషన్ ఏర్పాటు, హైటెన్షన్ రోడ్డు విస్తరణ, ఆర్‌కే పురం ఫ్లైఓవర్ పనుల పురోగతి, కొత్త అభివృద్ధి పనులకు నిధుల మంజూరు తదితర అంశాలను జెడ్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా పనులను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

#Sidhumaroju

Alwal