ఎన్నికలు విధులలో నిర్లక్ష్యం వద్దని పట్టణ సీఐ నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలంలో రేపు గురువారం జరగనున్న ఎన్నికలపై పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలు వద్ద అల్లర్లు, గొడవలు జరగకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, సమీపంలో జనాలు గుమికూడి ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తామని సీఐ నారాయణరావు చెప్పారు.
#RAJESH










