తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

0
2

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, పెద్దపల్లి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీలోని ఏలూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.