కళాకారుడికి ఇదేనా గౌరవం? సిరిసిల్ల జానపద గాయకుడికి అవమానం!

0
3

వందలాది మంది సమక్షంలో వేదికపై నుంచి దిగిపోవాలంటూ మైక్‌లోనే అవమానించారా? స్థానిక కళాకారులకు గుర్తింపు ఎక్కడ?

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జానపద గాయకుడు కమ్మరి తిరుపతి ఎన్నో జానపద గేయాలతో పాటు ఉద్యమ గీతాలను ఆలపించారు. పలు వీడియో ఆల్బమ్‌లను రూపొందించి యూట్యూబ్‌లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం టీఎస్ఎస్ కళాకారుడిగా కొనసాగుతున్నారు

అయితే, సిరిసిల్ల ప్రాంతానికి చెందిన స్థానిక కళాకారుడైన తిరుపతికి కనీస ఆహ్వానం, గుర్తింపు లేకపోవడం బాధాకరం. ఫోన్ చేసి పిలిచి రమ్మంటే వస్తానని వెళ్లిన ఆయనకు, వందలాది మంది సమక్షంలో మైక్‌లో పేరు పెట్టి వేదికపై నుంచి దిగిపోవాలంటూ చెప్పడంతో తీవ్ర అవమానానికి గురైనట్లు ఈ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇది ఒక్క కమ్మరి తిరుపతి ఆవేదన మాత్రమే కాదు.. ఎంతోమంది స్థానిక కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యకు అద్దం పడుతోంది

పక్కనే ఉన్న కళాకారులను గుర్తించకుండా, తోటి కళాకారులకు గౌరవం ఇవ్వకుండా.. ప్రభుత్వాలు, నాయకులు తమను గుర్తించడం లేదంటూ ప్రసంగాలు చేయడం ఎంతవరకు సమంజసం?

ముందుగా మన పక్కన ఉన్న కళాకారులను గౌరవించాలి. వారి ప్రతిభను గుర్తించాలి. అప్పుడే కళాకారుల గౌరవం గురించి ఇతరులను ప్రశ్నించే నైతిక హక్కు మనకు ఉంటుంది.

మొన్న జరిగిన TGFI ఆవిర్భావ సభలో సిరిసిల్ల స్థానిక కళాకారుడికి జరిగిన అవమానంపై కళారంగంలో చర్చ మొదలైంది

…