మోపాల్: రూ.1.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే గారు 🙏🙏

0
3

 

ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు.

మోపాల్ మండలం బాడ్సి, సింగంపల్లి, చిన్నాపూర్, కాల్వోల్, బైరాపూర్ గ్రామాల్లో రూ.1.35 కోట్ల పనులను ఆయన ప్రారంభించారు.

బాడ్సిలో పెద్దమ్మ ఆలయం దర్శించి, ముదిరాజ్ భవనానికి రూ.5 లక్షలు, పంచాయతీ భవనానికి రూ.20 లక్షలతో శంకుస్థాపన చేశారు.

సింగంపల్లి, చిన్నాపూర్ లో మహిళా సంఘ భవనాలను ప్రారంభించారు.❤️🎉🎉