చింతూరు కౌంటింగ్ వద్ద తీవ్ర ఉత్కంఠ, అభ్యర్థులకు నో ఎంట్రీ!

0
4

చింతూరు మండలం ఎర్రంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన అభ్యర్థులు కేంద్రం బయట చెట్టు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.కౌంటింగ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ చూడని విచిత్రాలు కౌంటింగ్ కేంద్రాల్లో చూస్తున్నామని ఎద్దేవా చేశారు. అభ్యర్థులను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

 

# Yadagiri