కొత్తగా 4.5 లక్షల పెన్షన్ లు : మంత్రి సీతక్క.

0
0

దీపావళి కానుకగా కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇవ్వనున్నట్లు గ్రామీణాభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. CM రేవంత్ రెడ్డి రేపు కొడంగల్ లో కొంతమందికి మంజూరు పత్రాలు అందజేస్తారని  అనంతరం అన్ని జిల్లాల మంత్రులు ప్రజాప్రతినిధుల ద్వారా పత్రాల పంపిణీ ఉంటుందని చెప్పారు. కొత్తగా మంజూరు అయిన వారికి ఈ నెల నుంచే పెన్షన్ చెల్లిస్తామని వెల్లడించారు. పండుగ వేళ లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు.