తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు – నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి

0
0

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్‌రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరెన్నో సంవత్సరాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం.

అదే సమయంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిధులు విడుదల చేస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంతగానో దోహదపడుతుందని కోరుతున్నాం.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ నిధుల విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.