దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై టపాసులు కాల్చడాన్ని పోలీసులు నిషేధించారు. శబ్ద కాలుష్యం నియంత్రణ కోసం నిర్ణయించిన సమయ పరిమితులను పాటించాలని కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. పోలీసుల ఆదేశాల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉంటుంది. ఈ సమయంలో కూడా శబ్ద కాలుష్య నిబంధనలకు లోబడి కార్యక్రమాలు జరగాలని సూచించారు. ఈ నిబంధనలు నవంబర్ 8 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 11 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. నగరాల్లో శబ్దం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పౌరులు సహకరించి నిర్ణయించిన సమయాలు, నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.










