● జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి సర్వే
● జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ జనగణన
● మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్
అల్వాల్,నవంబర్9:తెలంగాణలో జనగణన–2027 నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. జనాభా లెక్కల సేకరణ రెండో దశలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 30న జారీ చేసిన ఎస్.ఓ. 5913(ఈ) నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో పునఃప్రచురిస్తూ జీవో ఎంఎస్ నెం.155 జారీ చేసింది.
జనగణనలో భాగంగా మూడు దశల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు.
● జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు ఆన్లైన్ ద్వారా స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
● జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరిస్తారు.
● మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించి జనాభా లెక్కల సేకరణలో మిగిలిపోయిన వివరాలు, అవసరమైన సవరణలను పరిశీలిస్తారు.
2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను జనగణనకు ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణలో జనగణన–2027 నిర్వహణకు సంబంధించిన తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి.
#Sidhumaroju
Alwal










