పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు 25 వార్డు సభ్యులకు 20 గుర్తులను ఎస్సీఈఎస్ కేటాయించింది. ఇందులో మంచం,కత్తెర,బుట్ట,వంకాయ మొదలైనవి గుర్తులు ఉన్నాయి. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య పెరిగితే అధికారులు వారికి కొత్త గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు నోటా వేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈనెల 26, 29 తేదీలతో పాటు డిసెంబర్ 2న మూడవ విడతల కింద ఈ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ జరిగిన తేదీనే ఫలితాలు వెల్లడించనున్నారు.










