కార్తీక మాసం భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర RTC ప్రత్యేక బస్సులు.

0
4

కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు భక్తులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 8 వరకు ఈ సర్వీసులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. వేములవాడ, శ్రీశైలం, యాదాద్రి, కీసర, అనంతగిరి, ముచ్చింతల్, సోమశిల, పంచారామాలు, అరుణాచలం, హంపి తదితర క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రాంతాలవారీగా భక్తుల సౌలభ్యం కోసం సంబంధిత రూట్లలో సర్వీసులను కేటాయించినట్టు పేర్కొన్నారు. అనుసంధానంగా HYD పరిధిలో ప్రత్యేక ప్యాకేజీ సౌకర్యాన్ని కూడా ప్రకటించారు. 40 మంది ఉంటే ప్రత్యేక బస్సును బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. కార్తీక మాసంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున భక్తులు ముందస్తుగా సమాచారం తీసుకుని, సీట్ల లభ్యతను నిర్ధారించుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని TGSRTC సూచించింది.