● 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి అపహరణ కేసు పరిష్కారం
● ఎస్హెచ్ఓ ప్రశాంత్ పర్యవేక్షణలో డీఐ ప్రవీణ్ కుమార్, క్రైమ్ సిబ్బంది దర్యాప్తు
● పోలీస్ బృందాన్ని ఘనంగా సన్మానించిన జానకి నగర్ కాలనీవాసులు
అల్వాల్, నవంబర్ 11:మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్‌లో భారీ చోరీ కేసును పోలీసులు సమర్థవంతంగా పరిష్కరించారు. ఎస్హెచ్ఓ ప్రశాంత్ పర్యవేక్షణలో డీఐ ప్రవీణ్ కుమార్, క్రైమ్ సిబ్బంది సమన్వయంతో దర్యాప్తు నిర్వహించి కేసులో పురోగతి సాధించారు. పోలీసుల పనితీరుపై జానకి నగర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
జానకి నగర్‌కు చెందిన జి. నరసింహమూర్తి ఇంట్లో నవంబర్ 1న దొంగతనం జరిగింది. ఇంట్లో నుంచి సుమారు 29.2 తులాల బంగారు ఆభరణాలు, 27 తులాల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఎస్హెచ్ఓ ప్రశాంత్ పర్యవేక్షణలో డీఐ ప్రవీణ్ కుమార్, క్రైమ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి కేసును పరిష్కరించారు.
ఈ నేపథ్యంలో బాధితుడు నరసింహమూర్తితో పాటు కాలనీవాసులు శ్రీనివాస్, కార్తీక్, సూర్య, అమర్ తదితరులు మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్, డీఐ ప్రవీణ్ కుమార్‌లకు శాలువాలు కప్పి, పూలదండలు వేసి ఘనంగా సన్మానించారు.
దర్యాప్తులో భాగస్వాములైన క్రైమ్ సిబ్బందికి కూడా తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
#Sidhumaroju
Alwal










