🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా అర్హులైన 8,540 మందికి చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ కె. హరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్ పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
జిల్లా వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం మొత్తం 9,400 మంది దరఖాస్తు చేసుకోగా, అధికారులు విచారణ జరిపి అర్హులైన 8,540 మందికి పెన్షన్లను మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. పెన్షన్లు మంజూరు కావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.










