వాహన తనిఖీలో చిక్కిన నిందితుడు
ధర్పల్లి, మండలంలోని రామడుగులో మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన సిరికొండ మండలం కొండాపూర్ కు చెందిన సుద్ధపల్లి రాజు (35)ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి గొలుసు, చోరీకి వాడిన బైక్, ఎరుపు రంగు స్వెటర్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సీఐ రామన్ తెలిపారు.










