భూగర్భ జలాల పెంపునకు సోక్ ఫిట్స్ నిర్మాణం – గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన సర్పంచ్ కొర్సా రమేష్

0
2

భూగర్భ జలాల పెంపునకు సోక్ ఫిట్స్ నిర్మాణం – గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన సర్పంచ్ కొర్సా రమేష్

జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామపంచాయతీ పరిధిలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో కమ్యూనిటీ సోక్ ఫిట్స్, మ్యాజిక్ సోక్ ఫిట్స్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొర్సా రమేష్, ఎంపీఓ తులసీరామ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు సోక్ ఫిట్స్ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో సోక్ ఫిట్స్ నిర్మించుకునేందుకు ముందుకు రావాలని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని సూచించారు.

అనంతరం కొన్ని ప్రదేశాల్లో సోక్ ఫిట్స్ నిర్మాణానికి ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శైలజ, ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి, గ్రామస్తులు పాల్గొన్నారు.