భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి: జనకాపూర్ 1వ వార్డు పరిధిలో కొత్తగా మంజూరైన అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్, వార్డు అధికారితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా చేరువవుతున్నాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.










