భారత్ సమ్మిట్ 2026లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగం – పూర్తి వివరాలు

0
3

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ భారత్ సమ్మిట్–2026లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రసంగాలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు (AI), వాతావరణ మార్పులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులు చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచింది.

దాదాపు 70 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.