జాతీయ గౌరవ దివస్ బీర్షా ముండా 151 వ జయంతి వేడుకలను చింతూరు ఐటీడీఏ వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిట్టపులి నరేంద్ర పడల్, బీర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించారు. గిరిజనుల హక్కుల, ఆత్మగౌరవం కోసం పోరాడిన బీర్షా ముండా సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాలతో పాటు గిరిజనుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం , నేటి తరానికి స్ఫూర్తిదాయకమనీ పేర్కొన్నారు. భగవాన్ బిర్షా ముండా ఆశయాలను కొనసాగిస్తూ నేటి తరం గిరిజన సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. చింతూరు లో జరిగిన బీర్షా ముండ విగ్రహ ఆవిష్కరణ జాతీయ గౌరవ దివాస్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
# Yadagiri










