రోలుగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి అల్లు రమణమ్మ 500 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి పోతల లక్ష్మీ శ్రీనివాసరావు ప్రతిపాదించిన అభ్యర్థిగా రమణమ్మ బరిలోకి దిగారు. ఈ ర్యాలీకి వైఎస్ఆర్సిపి యువ నాయకుడు కాళ్ళ నాయుడు నాయకత్వం వహించారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో మార్పు కోరిక స్పష్టంగా కనిపించింది.










