AP: తుఫాన్ ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నట్లు IMD తెలిపింది. కాస్త దిశ మారడంతో ఈ నెల 20న బాపట్ల-తుని మధ్య, కాకినాడకు దక్షిణంగా తీరం దాటొచ్చని అంచనా వేసింది. కోనసీమ, కాకినాడ, ప.గో జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవొచ్చని APSDMA పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించింది.










