పూర్తిస్థాయిలో ఆరు గ్యారెంటీలు అమలు ఎక్కడ…!
రైతులపై చిత్తశుద్ధి ఉంటే రైతు బీమాను కొనసాగించాలి..మండల BRS పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు పత్రికా విలేకరులతో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ….రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడిచిన కాలంలో కూడా రాష్ట్ర ప్రజలకు గాని రైతాంగానికి గాని ఇచ్చిన 6 ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానిది…ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 200 రూ” ఇచ్చిన పెన్షన్ ను కెసిఆర్ అధికారం చేపట్టిన వెంటనే 200 పెన్షన్ ను 10 రెట్లు పెంచి 2000 రూపాయలు అందించినారు అదేవిధంగా వికలాంగులకు,వితంతులకు,ఒంటరి మహిళలకు,బీడీ కార్మికులకు,గీత కార్మికులకు,అనేక రకాలుగా వారికి లబ్ధి చేకూర్చారు…కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన సభలో 2000 రూపాయలు ఉన్న పెన్షన్ ను 4000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చినారు కానీ కెసిఆర్ ప్రవేశపెట్టిన 2000 రూపాయలని కొనసాగించడం మీరు ఇచ్చిన హామీని గాలికి వదిలేయడం సరైన పద్ధతి కాదు అని అన్నారు.ఎంతమంది వృద్ధులు,వితంతువుల,వికలాంగులు,ఒంటరి మహిళలు మీరు ఇచ్చిన పెన్షన్ హామీలకు ఎదురుచూస్తున్నారు. కెసిఆర్ రైతుల మీద ఉన్న ప్రేమతో ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రమాదస్తు ఒక రైతు కరెంటు షాక్ కొట్టడం వలన లేదా పాము కాటుకి గురవడమో లేదా ఇంకా వేరే కారణాలవల్ల మరణించినట్లయితే వారి కుటుంబానికి రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు 10-20 రోజుల్లోనే జమా కావడం జరుగుతుంది..అలాంటి గొప్ప పథకంపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఒకానొక ప్రెస్ మీట్ లో రైతు బీమా దండగ రైతు బతికున్నప్పుడు ఆదుకోకుండా చనిపోయిన తర్వాత డబ్బులు మాకు ఏందుకు అని ఏదైనా చేసిన విధంగా మాట్లాడడం చాలా బాధాకరం.ఇప్పుడు అదే పద్ధతిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అంటూ కుటుంబాన్ని పోషించే 18 నుండి 59 సం”రాల వయసు గల సభ్యుడు చనిపోతే బీమా పొందే అవకాశం కల్పించే పథకం గొప్పది ఐతే రైతు బీమా-రైతు బంధు పథకాలు కూడా అదే మార్గంలో ఉంటాయి.ఒక వేలు ఎదుటివారికి చూపెట్టేటప్పుడు 4 వెళ్లు మనకే చూపెడతాయని ని సీఎం రేవంత్ రెడ్డి వారికి గుర్తు చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వంద రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను పూర్తిస్థాయిలో ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందజేయాలి అని డిమాండ్ చేశారు..లేనిపక్షంలో రాష్ట్ర ప్రజానీకం రానున్న రోజుల్లో సరైన పద్ధతిలో బుద్ధి చెప్తారని అన్నారు.









