పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రధాన గేటు ముందే ఆటోలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తుండటంతో రోగులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయంపై సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా.. “వాళ్ల ఇష్టం.. వాళ్లక్కడే పార్కింగ్ చేసుకుంటారు” అంటూ సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారిందిఆసుపత్రి గేటు వద్ద వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది? రోగుల ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారుజిల్లా కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించి ఆటోల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించి, గేటు ముందు వాహనాల నిలిపివేతను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.










