తెనాలి మండల పరిషత్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు ఈనెల 19న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత కోఆప్షన్ సభ్యుని ఎన్నిక నిర్వహించి అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు చేపడుతామని ఎంపీడీవో అత్తోట దీప్తి తెలిపారు. అదే రోజు ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం, నామినేషన్ల స్వీకరణ,ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు.










