తెనాలిలో ఆక్రమణదారులకు జరిమానా- కమిషనర్

0
4

తెనాలి. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం పట్టణలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ తో కలిసి పంట కాలవ పరిసరాలను పరిశీలించారు. కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.. కాలువను శుభ్రపరిచే పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. మరోవైపున రోడ్లను ఆక్రమించిన పలువురికి జరిమానాలు విధించారు. అక్రమ అక్రమణాలను సహించబోమని హెచ్చరించారు.