దళిత నాయకుడిపై దాడి హేయమైన చర్య. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

0
3

🎤ఆసిఫాబాద్, నవంబర్ 19 (భారత్ ఆవాజ్ న్యూస్): ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలపై దాడులు చేయడం హేయమైన చర్య అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కిర్మిల వినోద్ మండిపడ్డారు. ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామానికి చెందిన దళిత నాయకుడు చాపిడి సురేష్‌పై జరిగిన దాడి ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధితుడికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు సురేష్ మరియు పలువురు నాయకులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారులకు ఫిర్యాదు పత్రం అందజేశారు.

గ్రామంలో జరుగుతున్న మురికికాలువ నిర్మాణ పనుల విషయంలో ప్రశ్నించినందుకే కొందరు వ్యక్తులు కక్షగట్టి సురేష్‌ను కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పనుల నాణ్యత గురించి అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఇలా దాడులకు తెగబడటం సరికాదని అన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరార.

ఈ దాడి ఘటనను తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కావేటి సబిత సైతం తీవ్రంగా ఖండించారు. దళితులపై జరిగే దాడులను సహించే ప్రసక్తే లేదని, బాధితుడి కుటుంబానికి అండగా నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడుతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.