ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా.. నేడే ప్రారంభం! దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ కె.హరిత

0
3

🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అమలు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత తెలిపారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే ఈ పథకం ఈరోజు (నవంబర్ 19న) సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుందని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ కె.హరిత మాట్లాడుతూ, 18 నుంచి 59 ఏళ్ల అర్హులకు రూ.5 లక్షల జీవిత బీమా అందించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తూ లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపారు. ఈ పథకం పేద కుటుంబాలకు కష్టకాలంలో ఆర్థిక అండగా నిలవనుందని పేర్కొన్నారు.