అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
716 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
దుగ్గొండి, నవంబర్ : భరత్ అవాజ్ న్యూస్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 716 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, మహిళలు, వృద్ధులు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలుకల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ సమ్మక్క, ఎంపీడీవో అరుంధతి, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీనివాసరెడ్డి,కుమారస్వామి, కిరణెడ్డి, రాజేశ్వరరావు, వెంకటాపురం గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…









