బోరింగ్‌కు కొత్త మోటార్ ఏర్పాటు చేయించిన కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): పట్టణంలోని 1వ వార్డు పోచమ్మ కాలనీ వాసుల దీర్ఘకాలిక తాగునీటి కష్టాలకు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ పరిష్కారం చూపారు. కాలనీ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అక్కడి బోరింగ్‌కు కొత్త మోటార్‌ను ఏర్పాటు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యపై తక్షణమే స్పందించి నీటి ఇబ్బందులు తొలగించిన కౌన్సిలర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా అవసరాలే లక్ష్యంగా, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పనికి సహకరించిన మున్సిపల్ కమిషనర్‌కు, మున్సిపల్ చైర్మన్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.









