కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటౌన్ మొదలైం 49193
2028లో కేసీఆర్ మళ్లీ తెలంగాణ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
జన చైతన్య సభ
భరత్ అవాజ్ న్యూస్ : హనుమకొండలోని జనచైతన్య సభ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి
కౌంట్హౌన్ మొదలైందని, 2028లో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండ కెడిసి గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు రాబోయే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి పిలుపునిచ్చారు. పెన్షన్లు పెంచామని చెప్పాలని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు వాస్తవాలు మాట్లాడాలని, నాలుగు లక్షల 71 వేల పెన్షన్లు తొలగించి కొత్తగా నాలుగు లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమే ఇచ్చినప్పుడు పెంచినట్లా.. తగ్గించినట్లా అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా అమలు చేయలేదని, ఒక్కో మహిళకు రూ.85,500 బకాయి పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అవినీతి, శాతం కమీషన్ల వ్యవహారాన్ని బయటపెడుతున్నారని, రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా పర్సంటేజీల పాలన సాగుతోందని మండిపడ్డారు… దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము…









