హైదరాబాద్ : బీసీ సంఘాలు రేపు తలపెట్టిన బీసీ బంద్ ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు(అక్టోబర్18న) బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో డిజిపి పలు సూచనలు చేశారు. శాంతి భద్రతలకు విభాగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, నిఘా బృందాలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్య వేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు.
Sidhumaroju