Home South Zone Andhra Pradesh పేకాట, వివాదాలు.. డీఎస్పీపై పవన్‌ సీరియస్‌ |

పేకాట, వివాదాలు.. డీఎస్పీపై పవన్‌ సీరియస్‌ |

0

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం, కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు పవన్ దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్, పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా వ్యవహరించకూడదని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.

NO COMMENTS

Exit mobile version