మన పిల్లల వైద్య విద్య కోసం వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా ఉద్యమంలో పాల్గొని కోటి సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలనికుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల అనుసరంగా కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పిలుపునిచ్చారు.
కోడుమూరు నియోజకవర్గం గూడూరు పట్టణంలో గురువారం చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, గూడూరు టౌన్ కన్వీనర్ అబెల్, కోడుమూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు, కౌన్సిలర్ కుమార్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ-కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో డాక్టర్ ఆదిమూలపు సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా వైఎస్ఆర్ సర్కిల్‌లో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న దృఢ సంకల్పంతో 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టారన్నారు.
పేదలకు అందాల్చిన వైద్యాన్ని కార్పొరేట్‌ల చేతిలో అప్పణంగా పెట్టేందుకు నేడు చంద్రబాబు ప్రభుత్వం ఆ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుండటం దారుణమన్నారు.
