హైదరాబాద్ – నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు.
ఈ కేసు విచారిస్తూ, మద్యం దుకాణాల నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ, విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం.
కనీసం రహదారిపైకి కనిపించకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని, మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి ఉంటుందని వ్యాఖ్యానించిన హైకోర్టు న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి.
నాగారం మున్సిపాలిటీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని మున్సిపల్, ఎక్సైజ్ అధికారులకు, షాపు యజమానులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.
Sidhumaroji
