మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు లో ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పికెట్ చౌరస్తా లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .
అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలు, కులాలకు సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడి దార్శనీకతను, స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకుని భావిభారత నిర్మాణానికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju
