బాపట్ల చేరుకున్న త్రిపుర యోగ టీం….
బాపట్ల: 44వ జాతీయస్థాయి యోగాసనా పోటీలకు హాజరయ్యేందుకు త్రిపుర నుంచి 52 మంది బృందం శనివారం ఉదయం బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్ సభ్యులు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు రెడ్డి నాగరాజు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, హనుమంతు తదితరులు వీరికి స్వాగతం పలికారు.
అనంతరం వీరిని పోటీలు జరిగే విశ్వజనని పరిషత్ ప్రాంగణానికి ప్రత్యేక వాహనాల్లో తరలించారు.
#నరేంద్ర
