దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించకపోవడమేనా?
అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన దుర్గగుడి అధికారులు మరియు ఈవో ఎందుకు పట్టించుకోలేదు.
దేవాదాయ శాఖ కమిషనర్ మరియు దేవాదాయశాఖ మంత్రి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు.
విఐపి దర్శనాల కోసం వస్తున్నారు గాని ఆలయంలో జరుగుతున్న అంశాలపై కనీస దృష్టి సారించడం లేదు.
అధికారుల నిర్లక్ష్యం వైఖరి వల్లనే అత్యంత పవిత్రమైన అమ్మ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో కూడా ఆలయంలో విద్యుత్తు సరఫరా లేదంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పోతిన వెంకట మహేష్
ysrcp నాయకులు విజయవాడ
గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు
