పరిగి, జనవరి 1, 2026: పరిగి మండలం గొరవనహల్లి గ్రామంలో నిన్నటి రోజున ‘జనతా ఫౌండేషన్ ట్రస్ట్’ నూతనంగా స్థాపించబడింది. సామాజిక సేవయే లక్ష్యంగా ఏర్పడిన ఈ ట్రస్ట్, తన సేవా కార్యక్రమాలను ఆరంభంలోనే క్రియాశీలకంగా ప్రారంభించింది.
తొలి సేవా కార్యక్రమం: ట్రస్ట్ స్థాపనలో భాగంగా నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమంలో భాగంగా, గ్రామంలోని దాదాపు 10 మంది నిరుపేదలకు మరియు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. చలి తీవ్రత దృష్ట్యా ఈ దుప్పట్ల పంపిణీ చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు లవన్, హేమంత్, నవీన్, చంద్ర, తరుణ్, సుధ మరియు నాగేంద్రతదితరులు పాల్గొని, స్వయంగా దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలవడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇట్లు, జనతా ఫౌండేషన్ ట్రస్ట్, గొరవనహల్లి, పరిగి మండలం.
#Newreporter #venugopal
