కర్నూలు : కోడుమూరు : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోడుమూరు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
పసుపుల గ్రామంలో గల ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి స్వగృహానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, KDCC ఛైర్మెన్ శ్రీ విష్ణువర్ధనరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ప్రజల ఆశీస్సులు, నాయకులు-కార్యకర్తల అండతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని సూపర్ సిక్స్ పథకాలే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అమలుజేశామని తెలియజేశారు.2026 సంవత్సరం కోడుమూరు నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తీసుకువచ్చే సంవత్సరంగా మారాలని ఆకాంక్షించారు.
ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో ఎప్పుడూ ముందుంటానని, కోడుమూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
