అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి ఆధ్వర్యంలో పౌర్ణమి గరుడసేవ అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో స్వామి దేవేరులు గరుడవాహనంపై మాడవీధులలో భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాస్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.
