Home South Zone Andhra Pradesh కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడితే చర్యలు : కమిషనర్

కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడితే చర్యలు : కమిషనర్

0

కర్నూలు : కర్నూలు జిల్లా
కార్పొరేషన్ ఆదాయానికి గండి పడితే సహించను• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కి రావాల్సిన ఆదాయానికి గండి పడేలా వ్యవహరిస్తే సహించబోమని, కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు.

బుధవారం ఆయన రెవెన్యూ విభాగ సిబ్బందితో మున్సిపల్ దుకాణాల అద్దెలు, పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. టైటిల్ ట్రాన్స్ఫర్ పన్ను విధింపు సమయంలో అవకతవకలను ఉపేక్షించబోమని, మున్సిపల్ షాపుల గుడ్‌విల్, అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆర్‌ఓలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఆర్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version