అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులను పరిశీలించి అధికారులకు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
మేలుపట్లలో చౌక దుకాణాన్ని తనిఖీ చేసి, లబ్ధిదారులకు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాము, ఆర్ఐ ఫణికుమార్, సిబ్బంది పాల్గొన్నారు# తూరు మురళి.
