కర్నూలు : కర్నూలు సిటీ :
గోనెగండ్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ !!
గోనెగండ్ల సర్కిల్ కార్యాలయాన్ని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గోనెగండ్ల సర్కిల్ పరిధిలో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఆరా తీశారు.ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, నేర నియంత్రణ కు చర్యలు చేపట్టాలన్నారు.
బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. సైబర్ నేరాల పై, మహిళ చట్టాల పై, నూతన చట్టాల పై ప్రజలకు అవగాహన చేయాలన్నారు. కర్నూలు ఎస్పీ తో పాటు ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి , గోనెగండ్ల సర్కిల్ సిఐ చంద్రబాబు నాయుడు ఉన్నారు.
