పుంగనూరు బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి ఆదేశాల మేరకు డిఎస్పీ మహేంద్ర సూచనలతో సీఐ సుబ్బరాయుడు పర్యవేక్షణలో
ఎస్సై కేవి రమణ ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీనేజ్ లో ఆకర్షణలను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి, చిన్నచిన్న విషయాలకు గొడవలు పడకుండా సహనంతో వ్యవహరించాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె శక్తి టీం సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
