పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన
పోలవరం, జనవరి 20:
పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. రెండో రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డాం గ్యాప్ 2 ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు .అంతకు ముందు కేంద్ర.
రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమై తోలి రోజు ఫీల్డ్ లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు.
వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్‌లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు.
